Site icon HashtagU Telugu

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం

Crime

Crime

Rangareddy: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గేటు వద్ద ఎదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, లారీలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ్మలోనిగూడ గేటు సమీపంలో వెళ్తున్న రెండు లారీలు ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగిందా లేక డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.