Site icon HashtagU Telugu

Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

Hyderabad (34)

Hyderabad (34)

Hyderabad: హైదరాబాద్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ముత్తంగి టోల్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో కారు పల్టీలు కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు .పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముత్తంగి టోల్‌ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు మహ్మద్ లుమాన్ (20) , సయ్యద్ మాజిద్ (21)గా గుర్తించారు. కాగా గాయపడిన వారిని ఇంకా గుర్తించలేదు. వారిని పటేన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మృతదేహాలను అదే ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో కారు తుక్కు తుక్కుగా మారిపోయింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు తెలిపారు. పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ కొనసాగుతోంది.

Also Read: Mega156: టాలీవుడ్ తెరపై సంచలనాత్మక కాంబినేషన్.. ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేయనున్న చిరు?

Exit mobile version