Pakistani drug smuggler: సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ చేతిలో హతమైన పాకిస్థానీ డ్రగ్స్ స్మగ్లర్స్

భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానంతో ఇద్దరు పాకిస్థానీలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) హతమార్చింది. ఈ మేరకు మంగళవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Pakistani drug smuggler: భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానంతో ఇద్దరు పాకిస్థానీలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) హతమార్చింది. ఈ మేరకు మంగళవారం అధికారిక వర్గాలు వెల్లడించాయి.

సోమవారం రాత్రి బార్మర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారనే అనుమానంతో ఇద్దరు పాకిస్థానీలను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కాల్చి చంపిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం దాదాపు మూడు కిలోల అనుమానిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

రాజస్థాన్ పశ్చిమ అంచున పాకిస్తాన్‌ భూభాగం, భారతదేశం భూభాగం దాదాపు 1,036 కి.మీ మేర కలిసి ఉంది. కాగా డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా ఉదంతాలు ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దులో తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి బీఎస్‌ఎఫ్ సీరియస్ గా తీసుకుంది.ఈ నేపథ్యంలో అనుమానితులపై ఫోకస్ చేస్తుంది. తాజాగా ఈ ఉదంతం బయటపడటంతో చర్చనీయాంశమైంది.

Read More: Gangster Tillu Tajpuriya: తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియా హత్య.. ప్రత్యర్థి ముఠా దాడి చేయడంతో ఈ ఘటన