Site icon HashtagU Telugu

Hyderabad: మార్నింగ్ వాకర్స్ ని ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్: 2 మృతి

Hyderabad

New Web Story Copy 2023 07 31t091004.216

Hyderabad: మార్నింగ్ వాక్ కొంతమందికి శాపంగా మారుతుంది. ఇటీవల మార్నింగ్ వాక్ చేస్తున్న ముగ్గురు మహిళలను ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టాడు. జూలై 4న సన్ సిటీలో వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ఒక మహిళ మరియు ఆమె కుమార్తె మరణించారు. ఆ ఘటన మరువకముందే ఈ రోజు తెల్లవారుజామున మరో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ లోని బొల్లారం ప్రాంతంలో తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బాలమణి యాదవ్ (60), రాధిక (48) మార్నింగ్ వాక్ కోసమని తెల్లవారుజామున కంటోన్మెంట్ బోర్డు పార్కుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ బలంగా ఢీకొట్టింది. 900 సీసీ స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న ఆదిత్య అనే యువకుడు గాయపడ్డాడు. 32 ఏళ్ల ఆదిత్య సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నాడు. తెల్లవారుజామున బైక్ రేసింగ్ కోసమని శామీర్‌పేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Also Read: Mini Brazil In India : ఇండియాలో “మినీ బ్రెజిల్” ఉంది తెలుసా ?.. ప్రధాని మోడీ కూడా ఆ ఊరిని ఆకాశానికెత్తారు !