Tirumala Leopard Roaming : వామ్మో ఇంకో రెండు చిరుతలా..? హడలిపోతున్న వెంకన్న భక్తులు..

ఇప్పటివరకు ఐదు చిరుతలా వరకు బోన్ లో చిక్కడం తో ఇక చిరుతలా బాధ తీరినట్లే అని ఊపిరి పీల్చుకున్నారో లేదో..మరో రెండు చిరుతలు కాలినడక దారి వెంట సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలో బయటపడడం

Published By: HashtagU Telugu Desk
Tirumala Leopard Roaming

Ttd

తిరుమల వెంకన్న (Tirumala Venkanna Swamy ) ను దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా కాలినడకన తిరుమలేశుడ్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ముసలివారు సైతం కాలినడకన (Kalinadaka) వెళ్లి ఆ వెంకన్నను దర్శించుకుంటుంటారు. అయితే ఇప్పుడు కాలినడకన అంటే భక్తులు హడలి పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘాట్ రోడ్ లో చిరుతలా (Leopards) సంచారం ఎక్కువపోతున్నాయి. కాలినడకన వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ చిరుతలా దాడిలో ఓ చిన్నారి మరణించగా..మరో చిన్నారి గాయాలతో బయటపడ్డారు.

ఆపరేషన్ చిరుత (Operation Chirutha) పేరుతో టీటీడీ అధికారులు చిరుతలు బంధించే పని పెట్టుకున్నారు. ఇప్పటి వరకు ఐదు చిరుతలు (5 Leopard trapped) బంధించారు. దాదాపు 300 ట్రాప్ కెమెరాలు పెట్టి చిరుతలా సంచారం గమనిస్తూ అక్కడ బోన్ లు ఏర్పాటు చేసి బందిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు చిరుతలా వరకు బోన్ లో చిక్కడం తో ఇక చిరుతలా బాధ తీరినట్లే అని ఊపిరి పీల్చుకున్నారో లేదో..మరో రెండు చిరుతలు కాలినడక దారి వెంట సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాలో బయటపడడంతో అధికారులతో పాటు భక్తులు షాక్ కు గురి అవుతున్నారు. స్పెషల్ టైప్ కాటేజీల సమీపంలో, నరసింహ స్వామి ఆలయం ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయన్నారు. ఈ రెండు చిరుతలను బంధించడానికి బోన్లు ఏర్పాటుచేశామన్నారు.

చిరుతలా సంచారంతో నడకమార్గంలో తీవ్ర కలకలం నెలకొంది. టీటీడీ ఈవో బంగ్లా సమీపంలోని స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర చిరుత కదలికలను గుర్తించారు. అలాగే నరసింహస్వామి ఆలయం సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 40 చిరుతలు ఉండొచ్చని అటవీ అధికారులు భావిస్తున్నారు. తిరుమల నడకదారిలో చిరుతల సంచారం భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో నడకదారిలో వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు మరింత తగ్గుతుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నడకదారిలో వెళ్లే భక్తులకు టీటీడీ ఊతకర్రలు ఇస్తుంది. మొత్తం మీద చిరుతలా వల్ల భక్తులకే కాదు టీటీడీ అధికారులకు , అటవీ అధికారులకు నిద్ర లేకుండా అయిపోతుంది. పూర్తిగా చిరుతలు బంధిస్తే కానీ మళ్లీ నడకదారి భక్తులతో కిటకిటలాడదు.

  Last Updated: 08 Sep 2023, 12:03 PM IST