Telangana Weather : తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు.. భారీగా చలి

రెండ్రోజులు తెలంగాణలో (Telangana) పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో (Telangana State) ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 17.0 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 31.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. మరోపక్క చలి కాలం కావడం.. తుపాను ప్రభావంతో చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని వాతావరణ నిపుణులకు చెప్తున్నారు.

Also Read:  Software Employee Murdered : తెలంగాణలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి హత్య..!