Site icon HashtagU Telugu

Medak : చెత‌బ‌డి నెంప‌తో ఇద్ద‌ర్ని చిత‌క‌బాదిన ప్ర‌జ‌లు..మెద‌క్ జిల్లా న‌ర్సాపూర్‌లో ఘ‌ట‌న‌

Black Magic Imresizer

Black Magic Imresizer

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పాపయ్య తండాలో చెత‌బ‌డి నెపంతో ఇద్ద‌ర్ని చిత‌క‌బాదారు. అదే మండలంలోని పెద్ద చింత కుంట గ్రామానికి చెందిన నూనావత్ భాస్కర్, కాట్రోత్ భాస్కర్ తమ బంధువుల ఇంట్లో గడిపేందుకు గ్రామానికి వెళ్లారు.అయితే గురువారం రాత్రి గ్రామంలో ప‌సుపు, కుంకుమ‌, నిమ్మ‌కాయ‌లు ఉండ‌టాన్ని కొంత‌మంది స్థానికులు గుర్తించారు. అయితే మ‌రుస‌టి రోజు నూనావత్ భాస్కర్, కాట్రోత్ భాస్కర్ గ్రామానికి రావ‌డంతో వీరు చెత‌బ‌డి చేసేవారిగా అనుమానించారు. ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి శుక్రవారం తెల్లవారుజామున ఇద్ద‌రు వ్య‌క్తుల్ని
పట్టుకుని చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.