Site icon HashtagU Telugu

Hyderabad : హైద‌రాబాద్ శామీర్‌పేట చెరువులో ఇద్ద‌రు వ్య‌క్తుల గ‌ల్లంతు.. మృత‌దేహాల కోసం గాలింపు

Death Representative Pti

Death Representative Pti

హైద‌రాబాద్‌లోని శామీర్‌పేట చెరువులో ఇద్ద‌రు వ్య‌క్తులు గ‌ల్లంతైయ్యారు. తన స్నేహితుడితో కలిసి షామీర్‌పేట చెరువు వద్ద చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి సోమవారం మధ్యాహ్నం నీటిలో మునిగి మృతి చెందాడు. ముషీరాబాద్‌లో నివాసముంటున్న షేక్‌ జహంగీర్‌ (42) తన సోదరుడు షాబుద్దీన్‌, ముగ్గురు స్నేహితులతో కలిసి ఉదయం ఫిషింగ్‌ లైన్‌, ఇతర సామగ్రిని తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లారు. మధ్యాహ్నం జహంగీర్ ఫిషింగ్ లైన్‌లో ఒక చేప చిక్కుకుపోయిందని గ్రహించి చెరువు లోపలికి వెళ్లి చూడ‌బోతుండ‌గా నీటిలోకి జారిపోయాడు. అది గమనించి షాబుద్దీన్ అతన్ని రక్షించడానికి వెళ్లి అత‌ను కూడా చెరువులో ప‌డిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సాయంత్రం వరకు ఆపరేషన్ కొనసాగింది. చీక‌టి ప‌డ‌టంతో రెస్క్యూ ఆప‌రేష‌న్‌కు అంత‌రాయం క‌లిగింది.