Site icon HashtagU Telugu

Sabarimala: 580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..

Ayyappa

Ayyappa

కాలినడకన శబరిమల యాత్ర అంటే అనుకున్నంత సులభమేమీకాదు. భక్తులకు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో పాటు.. ఓర్పు, సహనం ఉండాలి. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తి భావంతో బెంగళూరు నుంచి ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ.. మొదలైన ఈ అన్నాచెల్లెళ్లు సుమారు 580 కిలోమీటర్ల పాటు ప్రయాణించి కేరళలోని శబరిమలకు చేరుకోనున్నారు.