Site icon HashtagU Telugu

Inter Students Sucide : తెలంగాణ‌లో ఇద్ద‌రు ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌

Deaths

Deaths

హైదరాబాద్: తక్కువ మార్కులు వచ్చాయనే కారణంతో నగరానికి చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖైరతాబాద్‌లోని చింతల్ బస్తీలో గౌతమ్ అనే 18 ఏళ్ల యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో గౌతమ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌ని నిరుత్సాహానికి గురై ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన వెంట‌నే సమీపంలోని మహావీర్ ఆసుపత్రికి కుటుంబ‌స‌భ్యులు త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే విద్యార్థి చనిపోయినట్లు డాక్ట‌ర్లు తెలిపారు.దీనిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రెండో ఘటనలో సిరికొండ సాయి (16) అనే యువకుడు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో విద్యార్థి తల్లి అతన్ని మందలించిందని కోపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Exit mobile version