Site icon HashtagU Telugu

Delhi: న‌డిరోడ్డుపై కొట్టుకున్న ఇరువ‌ర్గాలు.. వీడియో వైరల్

Delhi

Delhi

ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో వైరల్‌గా మారింది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో దారిన వెళ్తున్న ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఒకరినొకరు దారుణంగా కొట్టుకుంటున్నట్లు గుర్తించారు. పరిస్థితి అదుపులోకి తీసుకువ‌చ్చి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారం న్యూ ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వీడియో ద్వారా యువ‌కుల‌ను గుర్తించిన పోలీసులు ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. వీడియోలో, కర్రలు, క్రికెట్ బ్యాట్స్ ప‌ట్టుకున్న వ్య‌క్తులు మ‌రో వ‌ర్గంపై దాడి చేసిన‌ట్లు ఉంది.అయితే ఇద్దరికీ పాత ఆస్తి తగాదాలు ఉన్నాయని, గతంలో కేసులు నమోదైనట్లు ఇప్పటి వరకు జరిపిన విచారణలో తేలింది.