Site icon HashtagU Telugu

Faridkot : గురుద్వారాలో కత్తులతో దాడి చేసుకున్న రెండు గ్రూపులు…ఎందుకంటే..?

Faridkot

Faridkot

పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోని గురుద్వారా సాహిబ్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది. గురుద్వారాలో అధ్యక్షఎన్నికకు సంబంధించి కోసం రెండు వర్గాలు కత్తులతో దాడికి పాల్పడ్డాయి. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి గురుద్వారా సాహిబ్ లో సమావేశం అయ్యారు. ఇందులో గురుద్వారా సాహిబ్ ప్రస్తుత కమిటీ సభ్యులు, మాజీ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. గురుద్వారా సాహిబ్ నిధుల విషయంలో అవకతవకలు జరిగాయి. ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 9 మందిపై కేసు నమోదు చేశారు. గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.