Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద.. రెండు గేట్లు ద్వారా దిగువ‌కు నీరు విడుద‌ల‌

శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుంది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు

  • Written By:
  • Updated On - July 24, 2022 / 04:40 PM IST

శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తుంది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. శ్రీశైలం రెండు గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల, సుంకేసుల నుంచి ప్రాజెక్టుకు 1,19,980 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 53,580 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కాగా, మొత్తం 885 అడుగులకు గాను ప్రస్తుతం 882.20 అడుగులకు నీటిమట్టం నిండింది. మొత్తం ప్రాజెక్టు సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 200.19 టీఎంసీలుగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ద్వారా 62,296 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.