IPL 2022: ఐపీఎల్ లో ఈసారి కొత్త రూల్స్ ఇవే

ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసారి పూర్తి సీజన్‌ను భారత్‌లో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవలే విడుదల చేసింది.

  • Written By:
  • Publish Date - March 15, 2022 / 11:58 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌కు ఇంకా 11 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈసారి పూర్తి సీజన్‌ను భారత్‌లో నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ క్రమంలో అన్ని జట్లు కూడా ట్రోఫీ గెలవడమే టార్గెట్ గా సన్నద్ధమవుతున్నాయి.. అయితే , ఈసారి ఐపీఎల్ 2021 సీజన్ రూల్స్ లో పలు మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఐపీఎల్ 2022 సీజన్ లో ఏదైనా జట్టుకు చెందిన ఆటగాళ్లకు మ్యాచ్‌కు ముందు కరోనా సోకితే వాళ్ళకు మరో అవకాశం ఇచ్చేలా నిబంధనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా జట్టులోని సభ్యులు కొవిడ్-19 బారిన పడి మ్యాచ్ కు 12 మంది ఆటగాళ్లు అందుబాటులో లేనప్పుడు బీసీసీఐ ఆ మ్యాచును రీషెడ్యూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. లేదా అదీ సాధ్యం కాకుంటే ఈ విషయాన్ని ఐపీఎల్ సాంకేతిక కమిటీకి సూచిస్తుంది.

ఆ కమిటీనే మ్యాచ్ నిర్వహణ పై తుది నిర్ణయం తీసుకుంటుంది.గతేడాది ఐపీఎల్ లో కరోనా సందర్భంగా సీజన్ ను అర్థాంతరంగా ఆపేసి తిరిగి దుబాయ్ లో రెండో దశను జరిపించింది. ఈ సందర్భంగా షెడ్యూల్ ను మొత్తం రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక ఐపీఎల్ 2022 సీజన్ లో ఒక మ్యాచ్ లో బ్యాటర్ క్యాచ్‌ ఔటైన సమయంలో క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్‌ చేయాల్సి ఉంటుంది.. ఇక ఐపీఎల్ 15వ సీజన్ లో ప్లేఆఫ్స్‌ , ఫైనల్‌ లాంటి మ్యాచ్‌లు టైగా మారితే వెంటనే సూపర్‌ ఓవర్‌ నిర్వహించనున్నారు. అది కూడా టైగా మారితే పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న జట్టునే విన్నర్ గా ప్రకటించనున్నారు.. ఇక ఐపీఎల్ 15వ సీజన్లో ప్రతి ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు రెండు రివ్యూలు కోరే ఛాన్స్ ఉంది.. అలాగే ఈ సీజన్ లో ఒక్కో జట్టు ఒక్కో ఇన్నింగ్స్‌లో 2 రివ్యూలు తీసుకునే అవకాశం ఉంది.