Site icon HashtagU Telugu

Chocolate Factory Explosion: చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. 9 మంది గల్లంతు.!

chocolate factory explosion

Resizeimagesize (1280 X 720) (1) 11zon

అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Chocolate Factory Explosion) సంభవించింది. ఈ పేలుడులో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతం పోలీసులు పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసును విచారిస్తున్నారు.

పెన్సిల్వేనియాలోని వెస్ట్ రీడింగ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ వెస్ట్ రీడింగ్ ఏరియాలో ఉన్న R.M. పామర్ కంపెనీ ప్లాంట్ పేలింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని తెలిపారు. ప్రమాదం తర్వాత తొమ్మిది మంది గల్లంతయ్యారు. శుక్రవారం సాయంత్రం 4.57 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనంలోని కొంత భాగం కూలిపోయి పక్కనే ఉన్న భవనం కూడా దెబ్బతింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Also Read: Eric Garcetti: భారత్ లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి..!

ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు చెబుతున్నా.. ముందుజాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని శుక్రవారం సాయంత్రం రీడింగ్‌లోని ఆసుపత్రిలో చేర్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన వారిని ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి తరలించారు.