Site icon HashtagU Telugu

NIBM Road: పూణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి పలువురికి తీవ్ర గాయాలు

NIBM Road

Img 20230521 Wa0045 1 1024x577

NIBM Road: పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాలలోకి వెళితే…

మహారాష్ట్రలోని పూణెలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పింది. దీంతో ఇతర వాహనాలపై ఆ వ్యాను దూసుకెళ్లడంతో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ఘటనలో 6 వాహనాలు ధ్వంసమైనట్లు పుణె పోలీసులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కోంధ్వాలోని ఎన్‌ఐబీఎం-ఉంద్రీ రోడ్డులోని ప్యాలెస్ ఆర్చర్డ్ సొసైటీలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో బస్సు, కార్లు, మోటార్ సైకిళ్ళు, చిన్న టెంపో మరియు ఆటో రిక్షాతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయని స్థానికులు చెప్తున్నారు. దీంతో రోడ్డు మూసుకుపోవడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంపై విచారణ పూర్తయ్యే వరకు రహదారిని మూసివేస్తామని స్థానిక అధికారులు ప్రకటించారు. ఈలోగా ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. కొనసాగుతున్న రహదారి పనుల కారణంగా క్లౌడ్ 9 మరియు సన్‌శ్రీ కంగన్‌ల మధ్య భాగం మూసివేయబడినందున వాహనాలు ఉండ్రి రహదారి గుండా, సంస్కృతి పాఠశాల మీదుగా మరియు డి-మార్ట్ సమీపంలోని కచ్చా రహదారి గుండా మళ్లించబడ్డాయి.

స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారుల్ని కోరుతున్నారు. కాగా కొందరు వ్యాపారాలు రాత్రి అక్కడే నిద్రపోవాల్సి వస్తుంది. దీంతో ప్రమాదాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

Read More: Cashew Nuts : జీడిపప్పు తక్కువ ధరకే కొనాలనుకుంటున్నారా.. అయితే అక్కడకు వెళ్లాల్సిందే..