Express Derail In Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో శనివారం రైలు ప్రమాదం (Express Derail In Madhya Pradesh) జరిగింది. ఇక్కడ ఇండోర్- జబల్పూర్ మధ్య నడుస్తున్న సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ (ఇండోర్-జబల్‌పూర్ ఓవర్‌నైట్ ఎక్స్‌ప్రెస్) రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయపడినట్లు సమాచారం లేదు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై సమాచారం సేకరిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటన కారణంగా మెయిన్ లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు. పశ్చిమ మధ్య రైల్వే CPRO హర్షిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఇండోర్ నుండి జబల్‌పూర్‌కు వెళ్తున్న ఇండోర్-జబల్‌పూర్ ఓవర్‌నైట్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు డెడ్ స్టాప్ స్పీడ్‌లో ఉన్నప్పుడు పట్టాలు తప్పాయి. ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. వారి ఇళ్లకు బయలుదేరారు. ఈ ఘటన తెల్లవారుజామున 5.50 గంటలకు జరిగింది. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుండగా..స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
Also Read: Ganapati Bappa: నేడు గణపతి బప్పాకు ఈ వస్తువులు సమర్పించండి..!
#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported.
More details awaited pic.twitter.com/A8y0nqoD0r
— ANI (@ANI) September 7, 2024
ఇటీవల రైలు ప్రమాదాలు జరిగాయి
దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా రైలు ప్రమాదాలు, పట్టాలు తప్పిన ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. గత నెల ఆగస్టు 17న వారణాసి నుంచి అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కనీసం 20 కోచ్‌లు కాన్పూర్‌లోని గోవింద్‌పురి స్టేషన్ సమీపంలో అర్థరాత్రి పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు.
అంతకు ముందు ఆగస్టు 4న ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి ‘వాషింగ్ షెడ్’కి తీసుకెళ్తుండగా ఖాళీగా ఉన్న లోకల్ రైలు మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు MEMU రైలు ఖాళీగా ఉందని, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. జూలై 18న ఉత్తరప్రదేశ్‌లోని గోండా సమీపంలోని మోతిగంజ్- జిలాహి రైల్వే స్టేషన్‌ల మధ్య చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 15904) 19 కోచ్‌లు పట్టాలు తప్పడంతో నలుగురు మరణించారు. చాలా మంది గాయపడ్డారు.