Site icon HashtagU Telugu

శ్రీకాళహస్తిలో క‌ల‌క‌లం.. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద మృతి

666

666

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘ‌ట‌న శ్రీకాళ‌హ‌స్తిలో క‌ల‌క‌లం రేపుతోంది. కాళహస్తి మండలం రాచగున్నేరి గ్రామంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మర్దాన్ జిల్లా ఆండాల్ గ్రామానికి చెందిన రమేష్, నీలన్ కుమారి దంపతులు. బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం శ్రీకాళ‌హ‌స్తికి వ‌చ్చారు. వీరికి ఇద్ద‌రు పిల్లలు, కూతురు హీనా కుమారి (5), కుమారుడు రోషన్ కుమార్ దాస్ (2) ఉన్నారు.

అయితే ఈ చిన్నారులు ఇద్ద‌రు ఒక‌రోజు అనుమానాస్ప‌దంగా మ‌ర‌ణించ‌డం శ్రీకాళ‌హస్తిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మొద‌ట గురువారం తెల్త‌వారు జామున‌ అస్వ‌స్థ‌త‌కు గురైన హీనా కుమారి చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. ఆ త‌ర్వాత అదే రోజు అస్వ‌స్థ‌త‌కు గుదైన రోష‌న్ కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్ర‌మంలో స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి, ఇద్ద‌రు పిల్ల‌ల మృతికి గ‌ల కార‌ణాలు తెలుసుకునేందుకు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈక్ర‌మంలో పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.