Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో ఇద్దరు చిన్నారులు అదృశ్యం

Missing

Missing

Hyderabad: వేర్వేరు ప్రాంతాల నుంచి ఇద్దరు చిన్నారులు అదృశ్యమైనట్లు మియాపూర్, జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం తెలిపారు. 17 ఏళ్ల విద్యార్థి మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయాడు. రెండు మూడేళ్లు దూరంగా ఉండడమే తన ఉద్దేశమని, తన కోసం వెతకడం లేదని ఓ నోట్‌ పెట్టాడు. అతని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ జాడ తెలుసుకోలేకపోయారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇక కాకినాడకు చెందిన 10 ఏళ్ల బాలుడు హైదరాబాద్ లో తన బంధువుల ఇంటికి వచ్చాడు.

చిన్నారిని తన అమ్మమ్మ తోడు లేకుండా డ్రైవర్ రాజేష్ సంరక్షణలో ఉంచింది. రాజేష్ చిన్నారిని ఇంటి వద్ద క్షేమంగా దింపాడని పోలీసులు తెలిపారు. కానీ నవంబర్ 22న పిల్లవాడు ఇంటి నుండి తప్పిపోయాడు. అతను చివరిసారిగా బుధవారం ఆలస్యంగా ఇంట్లో ఆడుకుంటూ కనిపించాడు. ఈ రెండు కేసులను విచారిస్తున్నామని, ఎవరికైనా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్లకు రావాలని అధికారులు కోరారు.