IED Blast: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు జరిపిన ఐఈడీ పేలుడులో (IED Blast) ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గర్పా గ్రామ సమీపంలోని శిబిరం నుండి బీఎస్ఎఫ్ బృందం పెట్రోలింగ్‌కు బయలుదేరినప్పుడు ఉదయం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి తెలిపారు. నక్సలైట్లు ఐఈడీని పేల్చి ఇద్దరు జవాన్లు గాయపడిన సమయంలో బీఎస్ఎఫ్ బృందం గర్పా గ్రామం మధ్యలో ఉందని చెప్పారు. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం ఉదయం బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) రోడ్ ఓపెనింగ్ పార్టీ (ROP) గార్పా గ్రామం దగ్గర తమ శిబిరం నుండి సెర్చ్ ఆపరేషన్‌కి బయలుదేరింది. రోడ్ ఓపెనింగ్ పార్టీ శిబిరం, గార్పా గ్రామం మధ్య ఉన్నప్పుడు నక్సలైట్లు ఒక ఇంప్రవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్ (IED) పేల్చారు. ఈ పేలుడులో ఇద్దరు కోబ్రా కమాండోస్ గాయపడ్డారు. ఒక పోలీసు అధికారి ప్రకారం.. వెంటనే ఇద్దరు జవాన్లను ఆస్పత్రికి తరలించి వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
Also Read: Psychology : ఈ ప్రవర్తన పురుషులలో కనిపిస్తే, బలహీనమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని అర్థం
ఇటీవల చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురుదాడిలో 17 మంది నక్సలైట్లు మరణించారు. ఈ ఎదురుదాడిలో పలు మందుగుండ్లు, ఇతర ప్రమాదకర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎదురుదాడి బీజాపూర్ జిల్లా పూజారి కంకేరు, మారురుబాకా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చోటు చేసుకుంది.
నక్సలైట్లు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపగా, సైనికులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఆ తర్వాత సైనికులు వెతకడానికి ప్రయత్నించగా.. అందులో 12 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు చలి కారణంగా అడవుల్లో పొద్దున్నే చీకటి పడుతుండటంతో సైనికుల సెర్చ్ ఆపరేషన్ పూర్తి కాలేదు. అందువల్ల సైనికులు రాత్రంతా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉదయం మళ్లీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లోనే ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.