Site icon HashtagU Telugu

Road Accident: దీపావళి ఓ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది..

Road Accident

Road Accident

Road Accident: దీపావళి ఓ ఇంట్లో విషాదం నింపింది. టపాకాయలు కొనుగోలు చేసేందుకు తల్లితో పాటు ఇద్దరు కుమారులు వెళ్లారు. కానీ అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తల్లి గాయాలతో బయటపడింది. ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకున్న ఆ తల్లికి పుట్టెడు దుఃఖం మిగిల్చింది. పైగా తండ్రి కూడా  రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. ఇలా ఒకే కుటుంబంలో రోడ్డు ప్రమాదాలకు గురై మరణించడం బాధాకరం. వివరాలలోకి వెళితే…

మెదక్ జిల్లా ఆటో నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. ఆటో నగర్‌లో నివాసముండే తల్లి అన్నపూర్ణ ఆమె కుమారులు పృథ్వీరాజ్( 12) , ప్రంతితేజ్ (10) దీపావళి పండుగను పురస్కరించుకుని పటాకులు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వెళ్లగా.. తల్లి స్కూటీ నడుపుతుండగా.. ఓ టిప్పర్ వచ్చి ఢీకొట్టింది. ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. గాయపడిన అన్నపూర్ణను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ రెండేళ్ల క్రితం హోంగార్డుగా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hyderabad: నగరంలో ఫార్మా కంపెనీలపై ఐటీ దాడులు