Site icon HashtagU Telugu

Suryapet: రెండు బైక్ లు ఢీ.. ముగ్గురు యువకుల దుర్మరణం

Bike Accident

Bike Accident

సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్) మండలం, నశింపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్థరాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు వేగంగా వచ్చి డీ కొనడంతో.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట నుండి ఏపూర్ వైపు ఎదురుగా వస్తున్న రెండు బైక్ లు అతివేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తేట్టేకుంట తండాకు చెందిన బానోతు అరవింద్, బొట్య తండాకు చెందిన భూక్య నవీన్, లక్ష్మి నాయక్ తండాకు చెందిన దరవత్ ఆనంద్ లు అక్కడికక్కడే మృతి చెందారు. ఏపూరుతండా కు చెందిన వినేశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్థానికుల సహాయంతో సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వినేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.