Site icon HashtagU Telugu

Twitter: ఎలాన్ మస్క్ కీ దిమ్మతిరిగే షాక్.. కేవలం ముగ్గురు వర్కర్లు మాత్రమే?

Twitter

Twitter

ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్ విషయంలో ఎప్పుడైతే జోక్యం చేసుకున్నారో అప్పటినుంచి ట్విట్టర్ రూపురేఖలే మారిపోయాయి. కాగా ఇప్పటికే ఎలాన్‌ మస్క్ వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ ట్విట్టర్ అకౌంట్ విషయంలో ఒక్కొక్క షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎలాన్‌ మస్క్‌ కీ ఊహించని షాక్ ఎదురయింది. అదేమిటంటే ఒకప్పుడు 100 మందికి పైగా ఉద్యోగులున్న ట్విటర్‌లోని ఆ విభాగంలో ఇప్పుడు పనిచేస్తున్నది కేవలం ముగ్గురంటే ముగ్గురే.

తినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ట్విటర్‌లో ఆడియో సంభాషణలకు సంబంధించిన ట్విటర్‌ స్పేసెస్‌ విభాగంలో ప్రస్తుతం మిగిలింది ముగ్గురేనని ప్లాట్‌ఫార్మర్‌ అనే సంస్థ నివేదిక ద్వారా వెల్లడించింది. ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెశాంటిస్‌ తాను అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించడం ఇటీవల సంచలనం సృష్టించింది. అమెరికా పునర్‌ వైభవం కోసం తాను పోటీ చేయబోతున్నట్లు ట్వీట్‌ చేశారు. ఎలాన్‌ మస్క్‌తో కలిసి ఆయన ట్విటర్‌ స్పేసెస్‌ ద్వారా లైవ్‌ ఆడియో ఛాట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో ట్విటర్‌ క్రాష్‌ అయిపోవడం తెలిసిందే.

అయితే ట్విటర్‌ క్రాష్‌ కావడంపై తాజాగా ఆసక్తికర నివేదిక వెలుగులోకి వచ్చింది. ట్విటర్‌ స్పేసెస్‌ విభాగంలో ఒకప్పుడు 100 మంది సిబ్బంది పనిచేస్తుండగా ఇప్పుడున్నది కేవలం ముగ్గురేనని తెలిసింది. ట్విటర్‌ స్సేసెస్‌ బృందం చాలా నెలలుగా సంస్థాగత జ్ఞానం లేకుండానే పనిచేస్తోందని ఆ నివేదిక తెలిపింది. కాగా క్లబ్‌హౌస్‌ అనే సంస్థకు పోటీగా ట్విటర్‌ 2021లో ట్విటర్‌ స్పేసెస్‌ పేరుతో ప్రత్యక్ష ఆడియో సంభాషణలను జోడించింది. ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ ఆధీనంలోకి తీసుకున్నాక ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు 100 మంది ఉన్న ట్విటర్‌ స్పేసెస్‌లో ఇప్పుడు మిగిలింది కేవలం ముగ్గరే అని ప్లాట్‌ఫార్మర్‌ నివేదిక బహిర్గతం చేసింది.