Twitter-3 Hour Videos : యూట్యూబ్ తో ట్విట్టర్ ఢీ.. త్వరలో 3 గంటల వీడియోలూ అప్ లోడ్ చేయొచ్చు

Twitter-3 Hour Videos : ట్విట్టర్ మరో సంచలన ఫీచర్ ను తీసుకురాబోతోంది.. 

  • Written By:
  • Updated On - July 3, 2023 / 03:33 PM IST

Twitter-3 Hour Videos : ట్విట్టర్ మరో సంచలన ఫీచర్ ను తీసుకురాబోతోంది.. 

త్వరలోనే  3 గంటల పెద్ద  వీడియోలను కూడా ట్విట్టర్ వినియోగదారులు  అప్‌లోడ్ చేసే అవకాశం కలుగుతుందని అంటున్నారు. 

లెక్స్ ఫ్రిడ్‌మాన్ అనే ప్రముఖ సైన్స్ యూట్యూబర్ తో జరిగిన చిట్ చాట్ లో ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ దీనికి సంబంధించిన హింట్ ఇచ్చాడు.   “టైమ్‌స్టాంప్‌లతో కూడిన 3+ గంటల పాడ్‌క్యాస్ట్ వీడియోలను ట్విట్టర్ లో అప్‌లోడ్ చేసే రోజులు ఎపుడొస్తాయో” అని  లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రశ్నించగా మస్క్ స్పందించాడు. “త్వరలోనే వస్తుంది”(Twitter-3 Hour Videos) అని లెక్స్ ఫ్రిడ్‌మాన్ కు మస్క్ బదులిచ్చారు. దీంతో హ్యాపీగా ఫీలైన లెక్స్ ఫ్రిడ్‌మాన్ మస్క్ కు ధన్యవాదాలు చెప్పాడు. ఆ ఫీచర్ రాగానే తనకు కబురు పెట్టాలని కోరాడు.  అయితే ఈ ట్విట్టర్ చాటింగ్ పై పలువురు నెటిజన్స్ కూడా అభిప్రాయాలను పంచుకున్నారు.

Also read :Modi Cabinet-New Faces : కేంద్ర క్యాబినెట్ లో 15 కొత్త ముఖాలు ? తెలంగాణ నుంచి ఒకరికి ఛాన్స్ !

వాస్తవానికి ఈ ఏడాది మేలో ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ సబ్‌స్క్రైబర్‌ల కోసం 2 గంటల వీడియోలను (8GB) అప్‌లోడ్ చేసే  ఫీచర్ ను మస్క్  అనౌన్స్ చేశారు. ట్విట్టర్ పెయిడ్ వినియోగదారుల కోసం వీడియో ఫైల్ పరిమాణ పరిమితిని 2GB నుంచి 8GBకి పెంచినట్లు అప్పట్లో  వెల్లడించారు.  ఈ మార్పులు జరిగినప్పటికీ గరిష్ట అప్‌లోడ్ నాణ్యత 1080pగా ఉంటుంది.