Site icon HashtagU Telugu

Twitter Vs Government : “ట్వీట్ల తొలగింపు ఆర్డర్స్” కేసు ఓడిపోయిన ట్విట్టర్.. 50 లక్షల జరిమానా

Twitter Content Creators

Twitter Content Creators

Twitter Vs Government : కొన్ని ట్వీట్లు, కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ను తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సవాలు చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.  ట్విట్టర్ వైఖరిని తప్పుపడుతూ రూ. 50 లక్షల జరిమానా కూడా విధించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ జారీ చేసిన ఆర్డర్స్ పై స్టే విధించాలన్న ట్విట్టర్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Also read : Smartphone In Toilet: బాత్ రూమ్ లో స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

కొన్ని ట్వీట్లు, కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ను తొలగించాలంటూ కేంద్ర సర్కారు జారీ చేసిన  ఆర్డర్స్ ఏకపక్షంగా, వాక్ స్వాతంత్ర్యానికి,  భావ ప్రకటన స్వేచ్ఛలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ 2022 జూలైలో ట్విట్టర్ వేసిన  పిటిషన్‌ ను విచారించిన కర్ణాటక హైకోర్టు ఈమేరకు తీర్పును వినిపించింది.  ట్విట్టర్ విదేశీ సంస్థ కావడంతో ప్రాథమిక హక్కుల అమలును క్లెయిమ్ చేసుకోలేదని ఈ కేసులో కేంద్రం(Twitter Vs Government) తెలిపింది. అయితే ఆర్టికల్ 14 ప్రకారం విదేశీ సంస్థలకు కూడా హక్కులు అందుబాటులో ఉన్నాయని కోర్టులో ట్విట్టర్ వాదించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద సూచించిన ప్రొటోకాల్‌లను కేంద్ర సర్కారు ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

Also read : Asteroid Attack Earth : పచ్చటి అడవిని ఆస్టరాయిడ్ బూడిద కుప్పగా మార్చిన వేళ..

ఈ కేసులో ఎన్నో మలుపులు..  

  • 2021లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా  రైతుల నిరసనలు ఉధృతమయ్యాయి.. ఈ టైంలో విపక్ష పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించాయి. ఈనేపథ్యంలో కొన్ని ట్వీట్లు, కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ను తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ట్విట్టర్ కు ఆర్డర్స్ వెళ్లాయి.
  • 2022 జూలై 4లోగా తమ ఉత్తర్వులను పాటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 28న మరోసారి ట్విట్టర్‌కు  లేఖ రాసింది. లేకుంటే మధ్యవర్తిగా తన చట్టపరమైన కవచాన్ని ట్విట్టర్  కోల్పోతుందని ప్రభుత్వం వార్నింగ్  ఇచ్చింది.  ఒకవేళ లీగల్ షీల్డ్‌ను కోల్పోతే.. ట్విట్టర్ యూజర్లు ఐటీ చట్టాన్ని ఉల్లంఘించిన కేసుల్లో ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్‌లకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుందని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన ట్విటర్‌ వెంటనే కర్ణాటక  హైకోర్టులో కొన్ని నిషేధ ఉత్తర్వులను సవాలు చేసింది.
  • “ట్విట్టర్ లో ప్రత్యేకించి కొన్ని ఖాతాలను బ్లాక్ చేయాలని ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు ? అందుకు గల కారణాలను ట్విట్టర్ కు ఎందుకు చెప్పలేదు? ” అని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక  హైకోర్టు ప్రశ్నించింది . ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ట్విట్టర్ కు కారణాలను తెలపాలని సర్కారుకు సూచించింది. కానీ ఆ తర్వాత కేంద్రం వాదనలతో ఏకీభవించి తాజా తీర్పును కోర్టు వినిపించింది.