Site icon HashtagU Telugu

Twitter Share: త్వరలో కొత్త బటన్.. సింగిల్ క్లిక్‌లో ట్వీట్‌లను షేర్ చేయవచ్చు..

Twitter

Twitter

మీరు త్వరలో మైక్రో బ్లాగింగ్ అండ్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో ఒక కొత్త బటన్‌ చూడవచ్చు. అవును, ట్విట్టర్ కొత్త ఫీచర్లను ఇండియా కోసం పరీక్షిస్తోంది, దీని ద్వారా యూజర్లు ట్విట్టర్ ట్వీట్‌లను నేరుగా వాట్సాప్ లో షేర్ చేసుకోవచ్చు. యూజర్లు సింగిల్ ట్యాప్‌లో వాట్సాప్ గ్రూపులు ఇంకా కాంటాక్ట్స్ కి ట్వీట్‌ను షేర్ చేయవచ్చు. ఇండియాలో వాట్సాప్ షేర్‌ బటన్‌ని తీసుకువచ్చిన మొదటి సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ ఒక్కటే కాదు, అయితే దీనికి ముందు వాట్సాప్ జనాదరణను దృష్టిలో ఉంచుకుని షేర్‌చాట్ వాట్సాప్ షేర్ బటన్ ను లాంచ్ చేసింది.

ట్విట్టర్ ఇండియా స్వయంగా ఈ ఫీచర్ గురించి సమాచారం ఇచ్చింది. మేము ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నామని, దీంతో ట్వీట్‌లను ఒకే ట్యాప్‌తో నేరుగా వాట్సాప్‌లో షేర్ చేయవచ్చని ట్విట్టర్ తెలిపింది. ట్వీట్‌లో వాట్సాప్ బటన్‌ను సాధారణ షేర్ బటన్‌తో కూడా భర్తీ చేయవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం, రెగ్యులర్ షేర్ బటన్ ట్వీట్ లింక్‌ను కాపీ చేయడం, బుక్‌మార్క్ చేయడం, డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపడం ఇతర సోషల్ మీడియాలోకి షేర్ చేయడం వంటి ఆప్షన్స్ అందిస్తుంది.

ఇండియాలో వాట్సాప్‌ కి 400 మిలియన్ల యూజర్లు
ఇండియాలో వాట్సాప్‌ ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ ఈ చర్యలో ఆశ్చర్యం లేకపోయిన వాట్సాప్‌ కి ఇండియాలో 400 మిలియన్లకు అంటే 40 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. ఇండియాలో ఫ్రెండ్స్ అండ్ కుటుంబ సభ్యులతో కంటెంట్‌ను షేర్ చేసుకునేందుకు అత్యధికంగా ఉపయోగించే యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. అందుకే ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లోకి ఎక్కువ మంది యూజర్లను మళ్లించడానికి మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ప్రజాదరణను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Exit mobile version