Twitter can’t be free for all: ట్విట్టర్ యూజర్లకు ఝలక్…ఛార్జీలు తప్పవన్న ఎలాన్ మస్క్..!!

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒకరు.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 02:29 PM IST

ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒకరు. ఆయన కన్ను ట్విట్టర్ పై ఎందుకు పడిందన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఎలాన్ మస్క్ తాజా ప్రకటనతో వీటికి తెరదించారు. ఇప్పటి వరకు ట్విట్టర్ యూజర్ల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. కేవలం యాడ్స్ ద్వారానే వచ్చే ఆదాయంతోనే ట్విట్టర్ నెట్టుకొస్తోంది. మరింత మంది యూజర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

అయితే దీన్ని బంగారు బాతులా చూశారు ఎలాన్ మస్క్. అందుకే 44 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసారు. ట్విట్టర్ సేవలు వినియోగించుకుంటున్న కొన్ని వర్గాల నుంచి ఛార్జీ వసూలు చేయనున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. సాధారణ యూజర్లకు ఛార్జీ ఉండదని..వాణిజ్యపరమైన వినియోగం, ప్రభుత్వాల నుంచి ఛార్జీ వసూలు చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు.

కాగా ట్విట్టర్ ను సాంకేతికంగా మరింత బలంగా, వినూత్నంగా మారుస్తానని మాస్క్ ఇప్పటికే ప్రకటించారు. స్వేచ్చగా అభిప్రాయాలు వెల్లడించే వేదికగా దీన్ని మార్చాలన్నదే తన అభిప్రాయమని ఎలాన్ మాస్క్ పేర్కొన్నారు.