Site icon HashtagU Telugu

Elon Musk and Twitter: పంతం నెగ్గించుకున్న ఎలాన్ మస్క్…!!

elon musk

elon musk twitter

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్…ట్విట్టర్ కొనుగోలు విషయంలో తన పంతం నెగ్గించుకున్నారు. ఎట్టకేలకు ట్విట్టర్ సంస్థ మొత్తానికి యజమాని అయ్యారు. ఎలాన్ మస్క్ ఇచ్చిన భారీ డీల్ పై ట్విట్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 44 బిలియన్లకు ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించిన పది రోజుల తర్వాత కీలక పరిణామాలు జరిగాయి. సోమవారం ఉదయం టెస్లా సీఈవోతో ట్విట్టర్ బోర్డు చర్చలు జరిపింది.

ఇక ఎలాన్ మస్క్ ఒక్కో ట్విట్టర్ షేర్ కు 54.20 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపారు. టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ చీఫ్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌కు మొత్తంగా 43 బిలియన్ డాలర్ల టేకోవర్ బిడ్‌ను ఆఫర్ చేసారు. ఈ భారీ డీల్‌కు ట్విట్టర్ కూడా అంగీకరించింది. ప్రస్తుతం ట్విట్టర్‌ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమమైందని ఎలాన్ మస్క్‌ కొన్ని రోజుల క్రితం ఆరోపించారు. తాను ఆఫర్‌ చేసిన ధర కంటే మంచి విలువను తీసుకురావడం ప్రస్తుత ట్విట్టర్‌ యాజమాన్యానికి సాధ్యం కాదన్నారు. మరోవైపు ట్విట్టర్‌ ఆదాయం కోసం ప్రకటనలపై ఆధారపడడాన్ని తగ్గించడం, ఎడిట్‌ బటన్‌, పొడవైన ట్వీట్లను అనుమతించడం లాంటి పలు మార్పులను మస్క్‌ ఇప్పటికే సూచించారు. స్వేచ్చా ప్రసంగం అనేది పనిచేసే ప్రజాస్వామ్యానికి పునాది…ట్విట్టర్ అనేది డిజిటల్ టౌన్ స్వ్కేర్ …ఇక్కడ మానవాళి భవిష్యత్తుకు కీలకమైన విషయాలు చర్చించబడుతాయని మస్క్ ఒక ప్రకటనలో తెలిపారు.

Exit mobile version