Elon Musk Tweet: నేను అనుమానాస్పదంగా మరణిస్తే….ఎలాన్ మస్క్ ట్వీట్..!!

ఎలాన్ మస్క్...ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
Elon Imresizer

Elon Imresizer

ఎలాన్ మస్క్…ఈ మధ్య కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా తాను పుతిన్ తో ఢీ కొట్టేందుకు రెడీ అవడం, సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ను కొనుగోలు చేయడం….ఇక కోకాకోలా మెక్ డొనాల్డ్ మిగిలి ఉన్నాయని ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎలాన్ మస్క్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నేను అనుమానాస్పద స్థితిలో మరణిస్తే…మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ కు గంట ముందు…ఉక్రెయిన్ లోని ఫాసిస్ట్ దళాలతోపాటు కమ్యూనికేసన్ సామాగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉందని..దీనికి మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని రష్యన్ అధికారి పంపిన మెసేజ్ ను మస్క్ షేర్ చేశారు. ఈ నేపథ్క్ష్యంలో తాను అనుమానాస్పదంగా మరణిస్తే…అని ట్వీట్ చేయడంలో పరోక్ష్యంగా రష్యాను ఉద్దేశించే ట్వీట్ చేశారన్న చర్చ నడుస్తుంది.

  Last Updated: 09 May 2022, 12:49 PM IST