Site icon HashtagU Telugu

Visakha: విశాఖ శ్వేత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు

D25a402b5b

D25a402b5b

Visakha: విశాఖపట్నంలో గర్భిణీ శ్వేత ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆమె అనుమానాస్పద మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూసైడ్ నా? లేదా హత్య? అనేది అనుమానంగా మారింది. హత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నాయి. అయితే శ్వేత మరణంపై సస్పెన్స్ గా మారింది. ఈ కేసు పోలీసులకు మిస్టరీగా మారింది. అత్తింటివారి వేధింపుల వల్ల శ్వేత బలవన్మరణానికి పాల్పడినట్లు కొంతమంది చెబుతున్నారు. అయితే హత్య చేశారా అనే అనుమానాలు శ్వేత కుటుంబసభ్యుల నుంచి వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో శ్వేత పోస్టుమార్టం రిపోర్ట్ ఈ కేసులో కీలకంగా మారింది. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు విషయాలు బయటపడే అవకాశముంది. అయితే శ్వేత మృతికి సంబంధించి విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ కీలక విషయాలు వెల్లడించారు. శ్వేత మృతదేహాం బీచ్‌లో లభ్యమైందని, శ్వేతది ఆత్మహత్యేనని చెప్పారు. శ్వేతపై అత్తింటివారి వేధింపులు నిజమేనని, శ్వేత తల్లి ఎదుటే దంపతులు గొడవ పడ్డారని చెప్పారు. శ్వేత కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారని అన్నారు.

శ్వేత పేరు మీద 90 సెంట్ల భూమి ఉందని, ఆ భూమి తన పేరు మీద రాయాల్సిందిగా శ్వేత భర్త మణికంఠ బలవంతం పెట్టినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. భర్త ఇబ్బంది పెట్టడం, అత్తమామలు చిన్నచూపు చూపడంతో శ్వేత మనస్తాపానికి గురైనట్లు పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. అత్తింటివారి వేధింపుల వల్ల గతంలోనూ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు.

శ్వేత భర్త, ఆడపడుచు భర్తపై కుటుంసభ్యులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామనన్నారు. శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పోస్టుమార్టం వీడియోగ్రఫీ కూడా చేయించామన్నారు. భర్త, అత్తింటివారిపై గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల క్రింద కేసు నమోదు చేశామన్నారు.