Rangareddy: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్.. నవీన్ టీ షాప్ తగలబెట్టిన యువతీ బంధువులు?

తాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్‌ డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌కు గురైన అందరికీ తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన

  • Written By:
  • Publish Date - December 9, 2022 / 09:58 PM IST

తాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్‌ డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌కు గురైన అందరికీ తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన 100 మందికి పైగా యువకులు వచ్చి వైశాలి ఇంటిపై ఆమె తల్లిదండ్రులపై స్థానికులపై దాడి చేసి ఆమెను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వైశాలి కిడ్నాప్ కేసులో ఒక ఊహించిన ట్విస్ట్ నెలకొంది. వైశాలి తన తండ్రికి ఫోన్ చేసి తన సిటీలోనే సేఫ్ గా ఉన్నానని తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆమె తెలిపింది.మరోవైపు వైశాలి కిడ్నాప్‌ ఘటనతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

యువతి కిడ్నాప్‌కు గురైందన్న విషయం తెలుసుకున్న బంధువులు ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. తీవ్ర ఆగ్రహంతో కిడ్నాప్‌ చేసిన నవీన్‌ రెడ్డి టీస్టాల్‌ను తగలబెట్టేసారు. అంతే కాకుండా వైశాలి కిడ్నాప్ కు సీఐ నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అలాగే సీఐని సస్పెండ్‌ చేయాలంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి గ్యాంగ్ ఇంటిపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన స్పందించలేదని, పోలీసుల వైఖరిని తప్పుపడుతూ సాగర్ రహదారిపై యువతి కుటుంబ సభ్యులు బంధువులు ధర్నాకు దిగారు.

దీంతో సాగర్ రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అయితే గతంలో వైశాలి తల్లిదండ్రులు నవీన్ రెడ్డి పై ఆదిభట్ల పిఎస్ లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని యువతీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వైశాలి సేఫ్ గా ఉన్నందుకు యువత కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు. కానీ పోలీసు వైఖరిని అలాగే నవీన్ రెడ్డి వారి ఇంటిని ధ్వంసం చేసినందుకు వైశాలి బంధువులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.