Site icon HashtagU Telugu

Twin Sisters Marriage: కవల అక్కాచెల్లెళ్లను పెళ్లాడాడు.. వరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ?

Twin Sisters Marriage

Twin Sisters Marriage

మహారాష్ట్రలోని సోలాపూర్ లో తాజాగా ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. వరుడు ఏకంగా ఇద్దరు కవల పిల్లలైనా అక్కాచెల్లెలను ఒకేసారి ఒకే వేదికపై పెళ్లాడిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియో వైరల్ గా మారడంతో కొందరు వరుడు పై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సోలాపూర్ కి చెందిన పింకీ, రింకీ అనే ఇద్దరు కవల పిల్లలు ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లుగా పని చేస్తున్నారు. అతుల్ అనే వ్యక్తి ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

అతుల్, పింకీ, రింకీ లను వివాహం చేసుకోవడానికి ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో తాజాగా వీరి వివాహం ఘనంగా జరిగింది. కొద్ది రోజుల క్రితం పింకీ, రింకీ ల తండ్రి అనారోగ్యం కారణంగా మరణించడంతో తల్లి దగ్గరే ఉంటున్నారు. అనంతరం కొద్ది రోజులకి తల్లి అనారోగ్యం పాలవ్వడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అతుల్ కారుని ఉపయోగించారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ఇష్టంగా మారి అతన్ని వివాహం చేసుకోవాలని ఆ ఇద్దరు కవలలు నిర్ణయించుకున్నారు. చిన్నప్పటినుంచి కలిసిమెలిగిన ఆ ఇద్దరు కవల పిల్లలు పెళ్లయిన తర్వాత కూడా ఒకే ఇంటికి వెళ్లాలి అనుకున్నారు. దాంతో అతుల్ ప్రేమించడంతో ఇరువురి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు.

 

దాంతో తాజాగా వారి పెళ్లి అంగరంగా వైభవంగా జరిగింది. పెళ్లిలో వరుడు మెడలో దండలు వేయడానికి వధువులు ఇద్దరు పోటీ పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూసిన కొందరు చట్టబద్ధత నైతికథ గురించి కామెంట్ చేశారు. ఆ విషయం పై స్పందించిన పోలీసులు.. కవల ఆడపిల్లలను పెళ్లి చేసుకున్నట్టుగా తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా వరుడిపై అక్లూజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం అతనిపై నాన్ కాగ్నిజబుల్ నేరం కింద కేసును నమోదు చేసినట్టు తెలిపారు.

Exit mobile version