Karnataka Elections: కర్ణాటక ఎన్నికలలో 12 మంది బీజేపీ మంత్రులు ఓటమి.. వారి పూర్తి జాబితా ఇదే..!

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మెజారిటీతో గెలిచి బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ (Congress) అధికారాన్ని చేజిక్కించుకుంది.

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 08:30 PM IST

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మెజారిటీతో గెలిచి బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ (Congress) అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి బిజెపి తన 31 మంది మంత్రుల్లో 25 మందిపై విశ్వాసం ఉంచింది. వారి సాంప్రదాయ స్థానాల నుండి వారిని రంగంలోకి దించింది. చామరాజనగర్‌, వరుణ స్థానాల నుంచి గృహనిర్మాణ శాఖ మంత్రి వి.సోమన్నకు మాత్రమే టిక్కెట్‌ ఇచ్చారు. వరుణలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోటీపడ్డారు. కర్నాటక ప్రజలు ఏ మంత్రులకు తమ పనికి తగిన ప్రతిఫలం అందించారో.. అసెంబ్లీ నుండి బయటకు వెళ్ళే మార్గం చూపిన వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అంతకుముందు 2018 కర్ణాటక ఎన్నికల్లో 224 సీట్ల అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీ 104 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ ఖాతాలో 80 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌కు చెందిన 37 మంది అభ్యర్థులు విజయం సాధించారు.

ఈసారి ఎవరు ఎవరితో ప్రత్యక్ష పోటీలో ఉన్నారు?

ఈసారి కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. జనతాదళ్ (సెక్యులర్) కూడా ఎన్నికల పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆప్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ సహా పలు చిన్న పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వాదనలు వినిపించారు.

ఎన్నికల బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు?

224 అసెంబ్లీ స్థానాలకు 2,615 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 901 మంది స్వతంత్రులు ఉన్నారు. బీజేపీ మొత్తం 224 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ 221 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. జేడీఎస్ నుంచి 208 మంది, ఆమ్ ఆద్మీ నుంచి 208 మంది, బీఎస్పీ నుంచి 127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమాజ్‌వాదీ పార్టీ 14 మంది అభ్యర్థులను, ఎన్సీపీ 9 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన 669 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 12 మంది మంత్రులు ఓడిపోయారు. వారి పేర్లను ఇక్కడ చూడండి.

1. ముధోల అసెంబ్లీ
గోవింద కార్జోల ఓటమి, ఆర్‌బి తిమ్మాపూర్ గెలుపు

2. బళ్లారి రూరల్ సీటు

శ్రీరాములు ఓటమి, బి. నాగేంద్ర గెలుపు

3. వరుణ సీటు
వి సోమన్న ఓటమి, సిద్ధరామయ్య గెలుపు

3.1 చామరాజనగర్
వి సోమన్న ఓటమి, పుట్టరంగశెట్టి గెలుపు

4. చిక్కనాయకనహళ్లి
జేసీ మధుస్వామి ఓడిపోగా, సురేష్ బాబు గెలుపు

5. బైలాగి
మురుగేష్ నిరాణి ఓడిపోగా, జెటి పాటిల్ గెలుపు

6. హిరేకెరూరు సీటు
బిసి పాటిల్ ఓడిపోగా, యుబిగా గెలుపు

7. చిక్కబల్లాపూర్
డా. సుధాకర్ ఓడిపోగా, ప్రదీప్ ఈశ్వర్ గెలుపు

8. హోస్కోట్
ఎంటీబీ నాగరాజు ఓడిపోగా, శరత్ బచ్చెగౌడ గెలుపు

9. KR పెట్
నారాయణగౌడ్ ఓడిపోగా, హెచ్ టీ మంజు గెలుపు

10. తిపటూరు
బీసీ నగేష్ ఓడిపోగా, కే షడక్షరి గెలుపు

11. యల్బుర్గా
హాలప్ప ఆచార్ ఓడిపోగా, బసవరాజు రాయరెడ్డి గెలుపు

12. నవలగుండ
శంకర్ మునేకొప్ప ఓడిపోగా, ఎన్ హెచ్ కొంరెడ్డి గెలుపు