Site icon HashtagU Telugu

Telangana : ఈ నెల 17న సోనియా సమక్షంలో కాంగ్రెస్ లోకి తుమ్మల..?

revanth reddy meet with thummala nageswara rao

revanth reddy meet with thummala nageswara rao

సీనియర్ నేత, తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara rao) కాంగ్రెస్ (Congress)గూటికి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ఇప్పటీకే రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ (BRS)..మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో మిగతా పార్టీల కంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరం మోగించారు కేసీఆర్. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఛాన్స్ ఇచ్చారు.

అయితే కొన్ని చోట్ల మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాకుండా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చాడు. దీంతో టికెట్ దక్కని వారు అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరే పార్టీలలో చేరాలని చూస్తున్నారు. అలాగే ఈసారి టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్న వారికీ కూడా కేసీఆర్ మొండిచెయ్యి చూపించడం తో వారు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆలా చూస్తున్నవారిలో సీనియర్ నేత తుమ్మల కూడా ఉన్నారు. ఇప్పటీకే కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth) తో తుమ్మల భేటీ కావడం జరిగింది. ఇక ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

Read Also : AP : బాబు కోసం జైలుకు జైలర్..అర్థమైందా రాజా..!

ఈ నెల 17 ఆదివారం కాంగ్రెస్ భారీ బహిరంగ సభ చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ ( Rahul Gandhi ), ప్రియాంక (Priyanka Gandhi )తో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హైదరాబాద్ తరలి రానున్నారు. ఇక వారి సమక్షంలోనే తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. సోనియా గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. తుమ్మల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే..ఖమ్మం లో కాంగ్రెస్ కు తిరుగు ఉండదని నేతలంతా భావిస్తున్నారు. ఇప్పటికే పొంగులేటి వాటి నేత చేరగా..ఇప్పుడు తుమ్మల చేరితే ఇక చూడాల్సిన పనిలేదని అంటున్నారు.