అందరు భావించినట్లే సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) బిఆర్ఎస్ కు రాజీనామా (Tummala resigns for BRS party) చేసారు. కొద్దీ సేపటి క్రితం తన రాజీనామా లేఖ పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ కు పంపించారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను’ అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల.. అప్పటి నుంచి బీఆర్ఎస్ అధిష్టానం ఫై అసంతృప్తితో ఉన్నారు. కనీసం తనతో చర్చలు జరిపి వేరే పదవి ఏదైనా ఇస్తారని ఆశించినా.. అక్కడా భంగపాటు తప్పలేదు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీరుపై మండిపాటుకు గురైన తుమ్మల తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయణ్ను కాంగ్రెస్ (Congress) పార్టీ ఆశ్రయించి తమ పార్టీలోకి ఆహ్వానించింది. కాంగ్రెస్ ఆహ్వానం అందుకున్న ఆయన హస్తం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారనున్నారు. హైదరాబాద్ లో నేడు , రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటూ సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు..ఇతర ముఖ్యనేతలూ హాజరుకానున్నారు. వీరి సమక్షంలో తుమ్మలు ఈరోజు కాంగ్రెస్ లో చేరనున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మారనున్నాయి. రాజకీయాల్లో తుమ్మల కు మంచి పేరు ఉంది. అభివృద్ధి మాంత్రికుడని స్థానికంగా పేరు ఉంది. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి మరింత బలం వచ్చినట్లు అవుతుంది.
Read Also : CTET Answer Key: సీటెట్ ఆన్సర్ కీ విడుదల.. ఆన్సర్ కీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?