Site icon HashtagU Telugu

TRS: టీఆర్ఎస్‌కు ఊహించ‌ని షాక్.. అస‌లు మ్యాట‌ర్ ఇదే..!

Trs Bjp

Trs Bjp

తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌కు ఊహించ‌ని షాక్ తగిలింది. తెలంగాణ‌లో రోజు రోజుకీ పొలిక‌ల్ హీట్ పెరుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఒక‌ పార్టీ నేత‌లు మ‌రో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ తాజాగా బీజేపీలో చేర‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈరోజు ఢిల్లీలోని తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ముధు మోహ‌న్ కాషాయ కండువా కప్పుకున్నారు.

ఇక మధు మోహన్‌తో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరారు. గతంలో రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కౌన్సిలర్‌గా గెలిచిన మధు మోహన్, ఆ త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. ఈ నేప‌ధ్యంలో మ‌ధు మోహ‌న్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ ఛైర్మన్లు అన్యాయానికి గురవుతున్నారన్నారు. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ స‌ర్కార్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని వెల్లడించారు.

Exit mobile version