నవంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ కోటా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టికెట్లు అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 22న ఉదయం తొమ్మిది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. దీంతో పాటు బ్రహ్మోత్సవంలో అక్టోబర్ ఒకటి నుండి ఐదో తేదీ వరకు అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయించరు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
TTD Darshan Tickets:శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల

Ttd Special Darshan Tickets