Break Darshan : వారాంత‌పు బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

వారాంతంలోని నాలుగు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శ‌నాలను ర‌ద్దు చేస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

  • Written By:
  • Publish Date - April 18, 2022 / 05:06 PM IST

వారాంతంలోని నాలుగు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శ‌నాలను ర‌ద్దు చేస్తూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భ‌క్తుల ర‌ద్దీ కార‌ణంగా తిరుమ‌ల శ్రీవారి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేస్తూ ప్రతిపాద‌న పెట్టారు. బ్రేక్ ద‌ర్శ‌నాల కార‌ణంగా సామ‌న్య భ‌క్తులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇటీవ‌ల భ‌క్తుల తొక్కిస‌లాట కూడా జ‌రిగింది. ఆ క్ర‌మంలో కీల‌క నిర్ణ‌యం బ్రేక్ ద‌ర్శ‌నాల విష‌యంలో తీసుకున్న‌ట్టు ఈవో అద‌న‌పు ధ‌ర్మారెడ్డి వెల్ల‌డించారు. తిరుమలలో రద్దీ నేపథ్యంలో అదనపు సిబ్బందిని నియమించామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. వారంతాల్లో నాలుగు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్టు వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులకు నీరు, ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. త్వరలో లగేజీ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఈనెల 11 నుండి 17 వరకు 5,29,966 మంది భక్తులు దర్శించుకున్నారని ఆయ‌న వెల్ల‌డించారు. వారం రోజుల్లో 24,37,744 లడ్డూలు విక్రయించామన్నారు. వారం రోజుల హుండీ ఆదాయం 32.50 కోట్లు వచ్చిందన్నారు. త్వరలోనే సర్వదర్శనం తిరిగి ప్రారంభించ‌డంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి వెల్లడించారు.