Site icon HashtagU Telugu

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్..!

Srivari Darshan Tickets Ttd

Srivari Darshan Tickets Ttd

శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ మ‌రో శుభవార్త చెప్పింది. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి సంబంధించి మార్చి 21 నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 300 ప్ర‌త్యేక ప్ర‌వేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలకు చెందిన టికెట్లు మార్చి 21న‌, మే నెల‌కు చెందిన టికెట్లు మార్చి 22న జూన్ నెల‌కు చెందిన టికెట్లు మార్చి 23న విడుదల చేయనున్నారు.

ఈ నేప‌ధ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు రోజుకు 30వేల టిక్కెట్లు,గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25వేల టికేటన్లను కేటాయించనున్నారు. ఆ రోజుల్లో ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదల కానున్నాయి. ఆఫ్ లైన్‌లో రోజుకు 30వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని భూదేవి కంప్లెక్స్‌, శ్రీనివాస కంప్లెక్స్‌, శ్రీ గోవింద రాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా భ‌క్తుల‌కు కేటాయించ‌బ‌డిందని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.