ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా శ్రీవారి భక్తులకు శుభవార్తలు చెప్పిన టీడీపీ, ఈసారి వెంకన్ సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో తాజాగా మూడు రోజుల్లో సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేస్తూ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వారంలో శుక్ర, శని, అది వారాల్లో సిఫార్సు లేఖల ద్వారా వచ్చే విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా, సామాన్య భక్తులకు సులువుగా శ్రీవారి దర్శనం దొరకడం కోసమే వీకేండ్‌లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో వారంలో చివరి మూడు రోజులు సర్వదర్శనం భక్తులు సౌకర్యార్థం అదనంగా దర్శన టోకేన్లు జారీ చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే రోజుకు 30వే సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి శ్రీవారి భక్తుల కోసం టీటీడీ తీసుకున్న నిర్ణయంతో టోకెన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.