TTD: శ్రీవారి భ‌క్త‌లు త్వ‌ర‌ప‌డండి.. ఈరోజు నుంచే స్పెష‌ల్ ద‌ర్శ‌నం టికెట్లు..!

  • Written By:
  • Publish Date - March 21, 2022 / 08:56 AM IST

శ్రీవారి భ‌క్తుల‌కు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. ఈ క్ర‌మంలో ఏప్రిల్ నెలకు సంబంధించిన టిక్కెట్లను భక్తుల కోసం ఈరోజు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. మార్చి 21న‌, మే నెలకు, మార్చి22న‌ జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. మూడు నెలలకు సంబంధించి 25 లక్షల టిక్కెట్లను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించిద‌ని స‌మాచారం.

ఈ నేప‌ధ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో రోజుకు ముప్ఫయివేల చొప్పుటన టిక్కెట్లను ఆన్‌లైన్‌ ఉంచుతారు. అలాగే గురువారం నుంచి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కట్లను విడుదల చేయాలని టీటీడీ భావిస్తుంది. ఈ టిక్కెట్ల అమ్మకం ద్వారా టీటీడీకి 75 కోట్ల ఆదాయం సమకూరనుంది. కరోనా కారణంగా భక్తులను రెండేళ్ల పాటు పెద్ద సంఖ్యలో అనుమతించలేదు. అయితే కరోనా తగ్గడంతో పెద్ద సంఖ్యలో ఆన్‌లైన్‌ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్టను టీటీడీ విడుదల చేయనుంది.

ఇక ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పురస్కరించుకుని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున తోమాల, అర్చన, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ లేదా రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని టీటీడీ తెలిపింది.