Tirumala: టీటీడీ రికార్డ్.. ఒక్కరోజు 92,238 మంది భక్తులు దర్శనం

నిన్న ఒక్కరోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 40,400 మంది తలనీలాలు సమర్పించారు

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 02:29 PM IST

సాధారణ కేటగిరీ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చేసిన ప్రయోగం అద్భుత ఫలితాన్నిచ్చింది. వెండి వాకిలి నుంచి సింగిల్ క్యూలైన్ విధానం సాటించడంతో ఆదివారం అత్యధిక సంఖ్యలో భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకున్నారు.  దీంతో తిరుమలలో భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజు 92,238 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,40,400 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం (Income) రూ.4.02 కోట్లు వచ్చింది. నిన్న ఒక్కరోజు రికార్డు (Record) స్థాయిలో 92,238 మంది దర్శించుకోవడం విశేషం.

Also Read: Modi Thali: యూఎస్ లో మోడీజీ స్పెషల్ థాలీ.. అదిరిపొయే వంటకాలతో!