వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం.. కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జూన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక ఉత్సవాలు ప్లాన్ చేస్తుంది. తిరుమల ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలి. జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర ఉత్సవం, జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు జ్వేష్టాభిషేకం నిర్వహించనున్నారు.
జూన్ 4: ఏరువాక పూర్ణిమ ఉత్సవం
జూన్ 14: మాత్రయ ఏకాదశి
జూన్ 28: పెరియాళ్వార్ ఉత్సవం
జూన్ 29: చాతుర్మాస్య వ్రత ప్రారంభం ఉత్సవం
భక్తులు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని, తదనుగుణంగా తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Dhoni Fans: ధోనిపై అభిమానంతో రైల్వే స్టేషన్ లోనే నిద్రించిన ఫ్యాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో!