Site icon HashtagU Telugu

TTD: శ్రీవారి భ‌క్తులకు మ‌రో శుభ‌వార్త చెప్పిన టీటీడీ..!

Ttd

Ttd

శ్రీవారి భ‌క్తుల‌కు టీడీపీ మ‌రో శుభ‌వార్త తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుమల తిరుప‌తి దేవ‌స్థానంలో రేప‌టి నుంచి అన్ని రకాల దర్శనాలు అందుబాటులోకి రానున్నాయని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల‌లో అన్ని రకాల దర్శనాలతో పాటు ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తున్నట్లు టీడీపీ అధికారుల తెలిపారు. ఇక క‌రోనా నేప‌ధ్యంలో గత రెండేళ్లుగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోఅన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసిన సంగ‌తి తెలిసిందే.

పరిమిత సంఖ్యలో గత రెండేళ్లుగా భక్తులను అనుమతిస్తుండటంతో, ఇతర రాష్ట్రాల భక్తులు శ్రీవారిని దర్శించుకోలేకపోయారు. అయితే రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలకు అనుమతి ఇవ్వడంతో తిరుమల మొత్తం వెంక‌న్న భ‌క్తుల‌తో నిండిపోనుంది. ఇక మ‌రోవైపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను టీటీడీ పునరుద్దరించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రోజు 1000 మంది వికలాంగులు, వయోవృద్ధులకు టీడీపీ ప్రత్యేక దర్శనం కల్పించనుంది. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.