Site icon HashtagU Telugu

TTD: కేంద్రం నిర్లక్ష్యంతో విదేశీ విరాళాలకు గండి

Template (6) Copy

Template (6) Copy

తిరుమల తిరుపతి దేవస్థానాలకి విదేశాల నుంచి అందే విరాళాలు ఆగిపోయాయి. వీటి స్వీకరణకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు ను సకాలంలో రెన్యువల్‌ చేయకపోవడంతో ఏడాది కాలంగా దేవస్థానానికి విదేశీ విరాళాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా సంస్థలు, సంఘాలూ విదేశీ విరాళాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి హోం శాఖ నుంచి లైసెన్సు పొందాలి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టానికి లోబడి ఈ లైసెన్సులు మంజూరవుతాయి.

విదేశాల నుంచి పలు సంస్థలకు, సంఘాలకు అందుతున్న నిధుల్లో సింహభాగం దుర్వినియోగం అవుతున్నాయన్న ఉద్దేశంతో వీటిపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర హోంశాఖా నిబంధనలను కఠినతరం చేయడంతో గత మూడు నాలుగేళ్లుగా ఈ తరహా లైసెన్సులు పొందుతున్న సంస్థలు, సంఘాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

టీటీడీ విషయానికొస్తే 2020 డిసెంబరులో ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు గడువు ముగిసింది. మారిన నిబంధనలకు అనుగుణంగా దేవస్థానం అధికారులు సకాలంలోనే రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసినా.. కేంద్రం నిర్లక్ష్యం తో టీటీడీకి విదేశాల నుంచి అందే విరాళాలు ఆగిపోయాయి. గతేడాది నుంచి కొవిడ్‌ కారణంగా దేవస్థానానికి ఆదాయం గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే తెలిసిందే.