Site icon HashtagU Telugu

TTD: భక్తులకు భద్రత కట్టుదిట్టం చేసిన టీటీడీ.. ఆ మార్గాల్లో 200 కెమెరాలు

Leopard

Leopard

TTD: చిరుతలు, ఎలుగు బంట్లు సంచారాన్ని గుర్తించిన్నప్పుడు వెంటనే భక్తుల రక్షణ కోసం అటవీ శాఖ, టీటీడీ సిబ్బంది చర్యలు చేపడుతుంది. ఈ మేరకు తిరుమల అలిపిరి నడక మార్గంలో వన్యమృగాల కదలికలు గుర్తించేందుకు 200 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డిఎఫ్ఓ సతీష్ తెలిపారు. మార్చి నెల 4వ తేదీ నుంచి ఇప్పటికీ ఐదు సార్లు మెట్ల మార్గానికి దగ్గరగా చిరుత, ఎలుగుబంటి సంచారం గుర్తించామని, వన్యమృగాల జాడ కు సంభందించి 4జీ నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ ద్వారా ఎప్పటి కప్పుడు ఫుటేజ్ వస్తోందన్నారు.

అలిపిరి మెట్లమార్గంలోని గాలిగోపురం నుంచి నరసింహ ఆలయం వరకు రాత్రి సమయాల్లో భక్తులను గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. గతంలో చిరుతలు మెట్ల మార్గంలో రావడం, పిల్లలపై దాడి చేయడం అలజడిని రేపింది. అయితే టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అటవీ జంతువులు మెట్ల మార్గంలోకి వస్తున్నాయి. దీంతో టీటీడీ మళ్లీ నిఘాను కఠినతరం చేసింది.