Site icon HashtagU Telugu

TTD Hundi : నిన్న ఒక్క రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.5 కోట్లు

TTD Hundi

TTD Hundi

తిరుమలలో 31 కంపార్ట్‌మెంట్లతో ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీరి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. కాగా నిన్న‌(మంగ‌ళ‌వారం) స్వామివారిని 74,212 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.5.05 కోట్లు వచ్చినట్లు తెలిపారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆణివార ఆస్థానానికి ముందుగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జూలై 17న వైభవంగా జరిగింది. ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి నాలుగు రోజుల ముందు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.