Site icon HashtagU Telugu

TTD EO : టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట..

Dharma Reddy TTD EO

Dharma Reddy

కోర్టు ధిక్కార కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (TTD EO) ధర్మారెడ్డికి హైకోర్టులో (High Court) ఊరట లభించింది. సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు బెంచ్ శుక్రవారం స్టే విధించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో టీటీడీ ఈవో కు నెల రోజుల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పు చెప్పింది. దీనిపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా శుక్రవారం జరిగిన విచారణలో సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

తమను క్రమబద్ధీకరించేలా టీటీడీ ఈవో (TTD EO) ను ఆదేశించాలంటూ ముగ్గురు ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు చెప్పింది. వారిని క్రమబద్ధీకరించాలని టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరిగింది. దీనిపై ఉద్యోగులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.

దీంతో కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సింగిల్ జడ్జి ధర్మాసనం నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.2 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై ఈవో ధర్మారెడ్డి హైకోర్టులో అప్పీల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్.. సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది.

Also Read:  Bharat Jodo Yatra : 100 రోజులకు చేరుకున్న భారత్ జోడో యాత్ర..!