TTD : టీటీడీ పాలకమండలి తాజాగా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. అధికారికంగా గుర్తించిన 31 మంది అన్యమత ఉద్యోగులు, టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ 31 మందిలో 2007 వరకు 27 మంది టీటీడీలో చేరారు, తర్వాత మరొక నలుగురు ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. వీరిలో మినిస్టీరియల్ విభాగంలో 10, వైద్య విభాగంలో 7, రవాణా , గార్డెనింగ్ విభాగాలలో 4, ఇంజినీరింగ్‌లో 3, విద్యాశాఖలో 2, కళ్యాణకట్ట విభాగంలో 1 ఉద్యోగి ఉన్నారు. వీరిలో హిందూ విశ్వాసాలు అనుసరించని వారు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా ఇతర మతాలను అనుసరించేవారూ టీటీడీలో ఉన్నారని ప్రచారం జరిగింది.
Viral News : అంత్యక్రియల్లో నివ్వెర పోయే ఘటన.. డాక్టర్ల నిర్వాకంతో..!
టీటీడీ ఈవో జే శ్యామలరావు ఈ విషయంపై స్పందిస్తూ, 31 నుండి 36 మంది అన్యమతస్థులు టీటీడీలో పనిచేస్తున్నట్లు నివేదికలు అందాయని చెప్పారు. అయితే వారంతా ఆలయ విధుల్లో లేరని, ఈ అంశంపై కోర్టులో రెండు కేసులు ప్రస్తుతం నడుస్తున్నాయన్నారు. 18వ తేదీన జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో, అన్యమతస్థులను విధుల నుంచి తొలగించాలని తీర్మానం చేసారు. అయితే వీరిని ఇతర విభాగాలకు బదిలీ చేయాలా లేదా వీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చే ప్రక్రియపై స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మాత్రమే ఈ నిర్ణయాలను అమలు చేయాలని వారు చెప్పారు.
ఇక, ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ, టీటీడీలో అన్యమతస్థుల విధులు నిర్వహించడం సరైనది అని చెప్పారు. ఇలాంటి వ్యక్తులు హిందూ ధర్మం మీద విశ్వాసం లేకుండా తిరుమలలో ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. తన అభిప్రాయం ప్రకారం, ఏ మతానికి చెందిన వారు అయినా, తిరుమలలోని పూజా స్థలాలు కొరకు హిందూ విశ్వాసం ఉండాలని ఆయన సూచించారు.
Sagar Adani: సాగర్ అదానీ ఎవరు..? అదానీ గ్రూప్‌లో అతని స్థానం ఏంటి?