Site icon HashtagU Telugu

Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం…సునామీ హెచ్చరికలు జారీ..!!

Earthquake

Peru Earthquake

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున సుమత్రా జిల్లాకు పశ్చిమాన ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు అయ్యింది. యూనైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. దాదాపు 11.9కిలోమీటర్ల భూఅంతర్భాగం లోతులో ఈ భూకంపం వచ్చిందని అధికారులు అంటున్నారు.

ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగిందనే సమాచారం ఇంకా తెలియలేదు. సునామీ వచ్చే ప్రమాదం లేదన్నారు అధికారులు. కాగా 2021 డిసెంబర్ లో సుమత్రా జిల్లాలో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 2018లో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాదాపు 15లక్షల మంది ప్రజలపై ప్రభావం చూపింది. 2004లో సుమత్రా దీవుల్లో వచ్చిన భూకంపం ఇండోనేషియాను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

 

Exit mobile version